Blogger Templates and Widgets
Showing posts with label లిఖిత. Show all posts
Showing posts with label లిఖిత. Show all posts

Friday, 13 February 2015 1:42 pm

Déjà vu | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
దినం మొత్తం అతనలా కూర్చుని ఉంటాడు, కిటికీ పక్కనమంచంపై - ఎదురెండ సోకి వాడిన ముఖంతో, గాలికి ఎగిసి వలయాలుగా తిరిగిమళ్ళా అక్కడే ధూళిలో రాలిన ఒక కాగితపు ఉండ వలే -ఉదయమూ వెళ్లిపోతుంది. మధ్యాహ్నమూ కరిగిపోతుంది.గింజలకై పావురాళ్ళు అతని ముందు తిరిగీ, తిరిగీ నిరాశతో ఎగిరివెళ్ళిపోయేసమయమూ ఆసన్నమయ్యింది. "వస్తారా ఎవరైనా తిరిగి"అని అతను నీడల్ని అడిగే లోపల, ఒక ఊహతో తెరపి పడే లోపలరెక్కలు కొట్టుకునీ, కొట్టుకునీ, తెగిన ఏ రెక్కో తగిలిఇన్ని నీళ్ళు ఉంచిన ముంత వొలికే పోతుంది. నీళ్ళకు తడిచి, గాలికి ఎండీబాల్కనీలో ఒక పక్షి ఈకా, మంచంపై ఒంటరి చేయీచీకట్లో  ఒక చెట్టూ, దుమ్ములో ఒక కాగితమూ అలాస్పృ... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 9 February 2015 8:05 pm

గంధా హై పర్ దందా హై యే | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
తెరవని తలుపులు నీవి.

అందుకనే ఎవ్వరూ రారు నీ వద్దకు. "అవసరం కోసం కాకుండా ఇద్దరు కలవచ్చు. కొంతసేపు మాట్లాడుకోవచ్చు. ఊరకే, రికామీగా, అట్లాగా... " అని నువ్వు నమ్మావు కానీ, లోకం అట్లా లేదనీ, నువ్వు అనుకున్న వాళ్ళెవ్వరూ అలా లేరనీ  తెలసి వస్తుంది. వాళ్ళ అవసరాలకే నువ్వు అనీ, నీ కోసం ఎవ్వరూ ఎదురు చూడరనీ, నువ్వు ఎప్పట్లాగే నీ గోడలతో, నీడలతో, నీడల్లో కనిపించే కథలతో బ్రతకాల్సి వస్తుందనీ అర్థం అవుతుంది. ఏం లేదు. కాలిక్యులటేడ్ ప్రపంచం. హెచ్చువేతలూ, కూడికలూ. నువ్వు నీ కవితల్లో వాంతి చేసుకున్నట్లు, మరికొందరు తమ భయాలనీ... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 4 February 2015 10:07 pm

ఆ ఇల్లు | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నువ్వు ఆ ఇంటికి వెళ్ళవు ఇప్పుడు
పాతబడిపోయింది ఆ ఇల్లు ఇప్పుడు
తలారబోసుకునే ఒక ముసల్ధానిలా, మగ్గిపోయి రాలిపోయే వేపాకులతో
వొంటరిగా నిలబడి ఉంటుంది ఆ ఇల్లు-

రంగులు వెలసిపోయిన గోడలూ, ఆవరణలో
పగిలిన పలకలూ, చెవులు రిక్కించి, మరి నీ
చేతి కోసమో, నీ మాట కోసమో ఒక ముదుసలి వలే ఎదురుచూస్తూ, గాలికి
బడబడా కొట్టుకునే గేటూ, అలజడిగా కదిలే

నీడలూ, మొక్కలూ, వీధుల్లో రికామీగా అరుస్తూ పిల్లలు -

నిజం.
నువ్వు వెళ్ళని ఆ ఇంట్లో ఏమీ లేదు ఇప్పుడు.

సాయంకాలపు ఎండ వాలిన గరకు చర్మం లాంటి
చికిలించిన కళ్ళ చుట్టూ ఏర్పడిన గీతల్లా... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 19 December 2014 11:00 pm

వాదన | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
తలుపులు తెరచి చూస్తే, నువ్వు వొదిలి వెళ్ళిన గుర్తులు:
బహుశా, నువ్వు నాకు ఇద్దామనుకుని తెచ్చిన
రెండు పుస్తకాలూ, ఇంకా ఒక పూలకుండీ -

నీకు తెలుసు: పూలను నేను ఎన్నడూ పెద్దగా ప్రేమించలేదని -
విరగబూసిన పూలని పూలపాత్రలో నింపుకుని
ఊరకే అలా చూస్తూ ఉంటాననీ, గడిచే కాలంతో
మారే వాటి రంగులూ, వడలే ఆకులు మాత్రమే

నాకు ఆసక్తి కలిగిస్తాయనీ, ఇంకా - గోడలపై  గాలికి రెపరెపలాడే
వాటి నీడలే నాకు మిక్కిలి ప్రాణమనీ, నిజానికి
కొమ్మకి ఉన్న పూలనెన్నడూ నేను వినలేదనీ!

అయినా, నువ్వు వచ్చిన ప్రతీసారీ నీతోపాటు ఒక పూలమొక్క
తల్లి ఒడిలాం... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 18 December 2014 6:19 pm

భారం | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
శీతాకాలపు చలిలో 
రాలే ఆకుల ముందు కూర్చుంటే
నువ్వే గుర్తుకు వచ్చావు -

రాలుతూ, గాలికి కదులుతూ
నేలపై అవి చేసే నీడల సవ్వడులే
నీ కళ్ళు.  

"ఇక ఇప్పుడు
ఎవరికి ఇవ్వను? నేను దాచిపెట్టిన
ఈ పూలను?"

అని అడుగుతావా
ఖాళీ గూడుగా మారిన ఒక ఊయల ముందు
కూర్చుని నువ్వు 

అమ్మాయీ  
కళ్ళు తుడుచుకుని, తల వంచుకుని  
కూర్చున్న వాళ్ళ ముందు

కూర్చుని
మాట్లాడగలిగే మాటలేమీ ఉండవు -
మళ్ళా వస్తాను

ఒక ఊయలతో
నీ అంత అశ్రువుతో, నీ అంత భారంతో
నీ అంత ప్రేమతో-  
... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 4 December 2014 2:04 pm

తల్లడిల్లే కాలం | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
పూవు రాలిపోతుంది.

హోరున వీచే గాలి దానిని లాక్కు వెళ్లిపోతుంది.
ఇక కొమ్మకు ఆకులు విలవిలలాడితే
ఏ క్షణాన అవి తెగుతాయో, ఏ క్షణాన
ఇక నువ్వు ఒంటరివాడివి అవుతావో

నీకూ తెలియదు, తనకూ తెలియదు-

తెలిసేలోగా
పూవూ రాలిపోతుంది. కొమ్మా విరిగిపోతుంది.
చేతిలోంచి చేయి జారి, నీ హృదయమే,ఈ
లోకపు మేళాలో ఎక్కడో తప్పిపోతుంది -

ఇక ధూళి రేగి, కళ్ళల్లో చేరి, మబ్బులో
లేక గుబులో లేక దారి పక్కగా ఒరిగిన
ఒక కాగితమో, దానిలోని ఒక పదమో

నువ్వు ఎన్నాళ్ళుగానో వెదికే ఒక పూవై
కొట్టి వేయబడి
విసిరివేయబడి

ఇక
దిద్ద... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 28 November 2014 10:10 pm

పెద్దపులి ఆ అమ్మాయి | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
పెద్దపులి ఆ అమ్మాయి.

తెల్లని చామంతుల కళ్ళే తనవి. నొప్పించినప్పుడు ఎవరైనా, బేలగా నీపై కురిసే మంచు రేకులే అవి. 

పెద్దపులి  ఆ అమ్మాయి.

తల్లివైపు పరిగెత్తే పసిపాపల వంటి చేతులే తనవి. ఓ ప్రేమ కోసమో, ఒక తోడు కోసమో, లోకంవైపూ ఇతరులవైపూ సాగి, నలిగిపోయి లుప్తమై వెనుదిరిగితే,... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 19 November 2014 11:23 pm

a little conversation of sorts | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"ఎలా ఉన్నావు?"

"తెలియదు."

" ఏం రాస్తున్నావు ఈ మధ్య?"

"Nothing."

"No thing or nothing?"

"రాయడం మానేసాను.
Or rather
It is the other way around."

"అంటే?"

" రాయడం
నేను మానేయడం కాదు
బహుశా ఆ లిఖితమేదో
నన్ను లిఖించడం
మానివేసింది."

"అవునా?"

"కాబోలు."

"ఇంకా?"

"........."

"మరి
If you are not writing
Or rather
If writing has left you

What are you
Left with

Right now?"

"Only this: 
You. నువ్వూ, ఇంకా
ఒక వాక్యం... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 6 November 2014 10:40 am

నీడలు | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
చీకటి ఒక దీపంలా వెలుగుతున్న క్షణాన
ఒక్కడివే నువ్వు-
అప్పుడు ఆ రాత్రిలో

తడిచి ముద్దయిన గోడలు. గోడలపై
లోపలేవో ఊగిసలాడుతున్నట్టు
విలవిలా కొట్టుకులాడుతున్నట్టు
అటూ ఇటూ ఊగే లతలలాంటి నీడలు. వణికే నీడలు-

ఏ దారీ చేరని, నిను వీడని ఊడలు. చేతులైనా కాని
ఒక ముఖమైనా కాని, ఒక పలుకైనా
కాని కాలేని, నిన్ను వణికించే నీడలు.

రాత్రి రెక్కల కింద, వెచ్చగా పొదగనివ్వని
పడుకోనివ్వని, తల్లి లేని నీడలు
నిన్ను తండ్లాటకు గురి చేసి
నిన్ను ఆనాధను చేసే నీడలు

'నువ్వు' అనే చీకటి దీపం చుట్టూ
వలయాలుగా పరచుకునే నీడలు
... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 5 November 2014 9:26 pm

నీడలు | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
చీకటి ఒక దీపంలా వెలుగుతున్న క్షణాన
ఒక్కడివే నువ్వు-

రాత్రిలో తడిచి ముద్దయిన గోడలు.
లోపలేవో ఊగిసలాడుతున్నట్టు
అటూ ఇటూ ఊగే లతలు. వొణికే నీడలు.

ఏ దారీ చేరని, నిను వీడని ఊడలు. చేతులైనా కాని
ఒక ముఖమైనా కాని, ఒక పలుకైనా
కాని, నిన్ను వణికించే నీడలు.

రాతి రెక్కల కింద, వెచ్చగా పొదగనివ్వని
పడుకోనివ్వని, తల్లి లేని నీడలు
నిన్ను తండ్లాటకు గురి చేసి
నిన్ను ఆనాధను చేసే నీడలు

'నువ్వు' అనే చీకటి దీపం చుట్టూ
వలయాలుగా పరచుకునే నీడలు
వాన సవ్వడి చేసే, కన్నీళ్ళ వాసన వేసే నీడలు
నల్లని, తెల్లని లేతేరుపు న... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 20 October 2014 10:36 pm

లిఖిత : పొదగబడి

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి
కనులు మౌనంగా ఊసులే చె... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 15 October 2014 9:41 pm

లిఖిత : అమ్మ కళ్ళు

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
"ఓ గాలీ, నువ్వు వెదురు సందుల్లో సంగీతం పాడడమేమిటి? శరదృతువులో వేణుగానానికి నెమలి పురివిప్పి ఆడడమేమిటి? మేఘం వెళ్ళే దారిలో మనసు తేలిపోతుంది ఎందుకని? బంధించబడి ఉన్న పుష్పం, గాలిసోకగానే రేకులు విచ్చుకుంటుంది ఎందుకని?" ...మలయాళ సినీ గేయరచయిత రఫీక్ అహ్మద్ రచించిన ఒకానొక పాట మూలార్దానికి కొంచం దగ్గరగా ఉండే అనువాదం ఇది. అర్ధం నిన్న మొన్ననే తెలిసినా, దాదాపు పదిరోజులై ఆ పాట చెవుల్లో మారుమోగుతోంది.

"కాథే కాథే నీ పుక్కామరథిల్ పట్టుం మూలి వణ్నో..." ఎలా ప్రవేశించిందో కానీ ఓ పది రోజుల క్రితం ఈ పాట మా ఇ... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 11 October 2014 11:00 pm

లిఖిత : ఒక క్షణం

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
అప్పుడు, నీ కన్నులు లేతెరుపును అద్దుకుంటాయి
అప్పుడు, నీ ముఖంపై మబ్బులు కమ్ముకుంటాయి
అప్పుడు

నీ శరీరంపై ఏవో చెట్లు హోరున వీయగా
ఆ చల్లటి గాలిలోనీ కాళ్ళూ చేతులకు పైగా
పక్షులూ సీతాకోకచిలుకలూ తేలిపోతాయి 

అప్పుడు
నీ చెవులలో పురాతన కథల గుసగుసలు
గుర్రాలూ, గూళ్ళూ, ఎగిరే ఎన్నెన్నో చేపలు-
నీ పెదాలపై పాల వాసనా, బుగ్గలపై మెత్తగా

ముద్దులు. మూసుకునే నీ చేతివేళ్లల్లో
ఒక తల్లి శిరోజాలు. తన కలలు నీవై
నీ కలలు తనవై, తన తనువై, వెరసి

ఒక మొగ్గ, పూవుని కావలించుకుని పడుకునే
ఒక దైనందిన ఇంద్రజాలం. చూసే నాలో
జ... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 8 October 2014 6:59 pm

లిఖిత : నిశ్శబ్ధం

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"నిశ్శబ్ధం అనేది ఉందా అసలు?"
అని అతను, తనని తాను ప్రశ్నించుకున్నాడు-

ఎదురుగా గోడలపై, లతల వలే జారే వాన నీళ్ళు.
ఒక పసివాడి తలని నిమిరినట్టు
నిన్ను లాలనగా నిమిరే ఓ గాలి

నీడలు లేని ఒక కాంతి అప్పుడు నీలో: నీ ప్రాంగణంలో-
మౌనముద్రలో ఉన్న బుద్ధుని
ఛాయాచిత్రాన్నేదో నీకు జ్ఞప్తికి
తెచ్చే చెట్లూ, పూలూ, ఆకులూ-

అక్కడక్కడే ఎగిరి నీ పక్కగా వాలే ఒక తూనీగ: ఇక
ఎవరో నెమ్మదిగా నీ పక్కగా చేరి
కుదురుకుని కూర్చున్నట్టున్న

సాయంత్రంలో, సరిగా అప్పుడు కొంత కలకలం. సరిగ్గా
అప్పుడు కొంత, కదలిక లేని కదలిక-
కుండీలో ప... పూర్తిటపా చదవండి...


View the Original article