రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నువ్వు ఆ ఇంటికి వెళ్ళవు ఇప్పుడు
పాతబడిపోయింది ఆ ఇల్లు ఇప్పుడు
తలారబోసుకునే ఒక ముసల్ధానిలా, మగ్గిపోయి రాలిపోయే వేపాకులతో
వొంటరిగా నిలబడి ఉంటుంది ఆ ఇల్లు-

రంగులు వెలసిపోయిన గోడలూ, ఆవరణలో
పగిలిన పలకలూ, చెవులు రిక్కించి, మరి నీ
చేతి కోసమో, నీ మాట కోసమో ఒక ముదుసలి వలే ఎదురుచూస్తూ, గాలికి
బడబడా కొట్టుకునే గేటూ, అలజడిగా కదిలే

నీడలూ, మొక్కలూ, వీధుల్లో రికామీగా అరుస్తూ పిల్లలు -

నిజం.
నువ్వు వెళ్ళని ఆ ఇంట్లో ఏమీ లేదు ఇప్పుడు.

సాయంకాలపు ఎండ వాలిన గరకు చర్మం లాంటి
చికిలించిన కళ్ళ చుట్టూ ఏర్పడిన గీతల్లా... పూర్తిటపా చదవండి...


View the Original article