అప్పుడెప్పుడో ఒకళ్ళనొకళ్ళం విదిల్చుకున్న జ్ఞాపకం బతుకు పట్టాల కింద చిక్కగా నలిగి అతుకులేసుకున్న శరీరం సూరీడు విరజిమ్మిన కుప్పల వీర్యంలో రోజంతా వెలుగుతున్న నేను చీకట్లకు తలకొరివి పెడుతూ స్ఖలించని కాపరినై నా దేహాన్ని నువ్వూ నేనూ కలిపి పేర్చుకున్న అందమైన చితి మంచం మీద ముచ్చట్లాడుకున్న రతి చక్రవర్తులం మనం కాదా
ఇంకోసారి కొత్తగా మొదలెడతాం మళ్ళా ఆగిపోయిన చోటి నుండే నా నుండో నీ నుండో కొన్ని పదాలు పుడతాయి మన చేతులకు పని చెబుతాయి పసి వేళ్ళు అలిసిపోయే దాకా రాస్తూనే ఉంటాం నీళ్ళల్లో సగం తేలుతూ సముద్రాన్ని శాసిస్తాం ఈ అక్షరాలు కూడా అంతే అన్నీ రాసేశాంలే అనుకునేలోగా ఇంకొన్ని బుల్లి పదాలు పుట్టుక మొదలవుతూనే ఉంటుంది కొన్నాళ్ళయ్యాక పాత డైరీలనో అమ్మ దాచిన చిత్తు కాగితాల్లోనో మనల్ని చూసుకుంటాం మనమేనా వీటిని రాసింది అనుకోక మానం అప్పుడు ఇంకో ఆలోచన మెదడునూ మనసునూ తొలిచేస్తూ ఇంకా రాసుండాల్సిందే ఇక్కడే ఎలా ఆపేశాం అనే తపన అంతరాళంలో భావు... పూర్తిటపా చదవండి...
ఒకసారి సంభాషించడం కూడా కష్టమే మన ముఖాలు ఒకరికికొకరు అలవాటు పడిపోయాక పొద్దున్నే లేవడం న్యూస్ పేపరుతోనో నీలపు రంగున్న ఆకాశంతోనో మనం మాట్లాడుకుంటాం మనిద్దరం అనుకుంటూనే ఉంటాం బోళ్ళు చెప్పుకోవాలని కానీ తెరచిన కిటికీ రెక్కలమే అవుతాం ఎప్పుడో తెరుచుకుంటాం ఒకరికొకరం ఎదుపడుతున్నప్పుడల్లా నీ ముఖంలోకి నా ముఖం చొచ్చుకుపోవడం అంతర్లీనంగా నీకేదో నేను చెప్పాలనుకోవడం నువ్వు నాతో...
అప్పుడు ఇలా ఉంటాం hey హా చెప్పు
అదీ... ఏంటి? సాయత్రం అలా నడుద్దామా మనం ఒకసారి ఒక smiley గుండెలో జీర నాలో
రోడ్డు మీద నడుస్తున్న నేను నన్ను పలకరించరించడానికొచ్చిన ఒక ముసురు వాన తుంపరలన్నీ మట్టిలో తడుస్తూ తొణికిసలాడే మొసళ్ళు ముఖం మీదో చేతుల పైనో భళ్ళున పడి జారిపోవడం చొక్కా జేబులో గుప్పెడు మన్నీళ్ళు ఇంట్లోకొచ్చాక ఒక తడి వాసన తల నిమిరిన నా చేతివేళ్ళకు చీమలు పాకిన ఆకులు పడవలై అక్కడక్కడే బాల్కనీ అంతా నిండిన కొత్త నీళ్ళు తడిసిపోయిన కాగితాలు పుస్తకాల్లో దాక్కుంటూ రంగులను విసిరి ఎక్కడో జల్లుతాయి నిన్నూ నన్నూ ఒక్కసారి కదుపుతూ పచ్చని అడవిలో అడక్కుండా కురిసిన శబ్దం కీచురాళ్ళ సంగీతం వినబడీ వినబడకుండా మసకగా అడుగులు మన... పూర్తిటపా చదవండి...
కొన్ని ఉదయాలు స్తబ్దత ఉన్న తరంగాలుగా ఆకులపై రాత్రి విడిచిన గుర్తులు మంచుబిందువులై ప్రసవించడం నీ కళ్ళలోనో నా చేతుల్లోనో ఒక్కోసారి తేలికగా ఇంకాల్సిన నుసులు అలా ఎప్పుడో నేనూ తడుస్తాను నువ్వు లేకుండానే అందంగా కొన్ని ఉమ్మెత్త పూలు ప్రతిసారీ ఆత్మహత్య చేసుకుంటూనే నీ చూపులు దాటి వెళ్ళినప్పుడల్లా సరే ఇక సముదాయించాలిగా నువ్వో నేనో మన మధ్య కొన్ని సంజాయిషీలను నిలబెట్టడం విచ్చిన్న ఆత్మలుగా దిక్కులనంటడం కళ్ళరాళ్లు మనం కూడా విగత జీవులమేగా అప్పుడప్పుడూ రెప్పల కిటికీలను బలవంతంగా మూసినప్పుడల్లా ఎందుకో స్మశానాలను కూర్చోబెట్ట... పూర్తిటపా చదవండి...
అసంఖ్యాకమైన ఆలోచనలు నీలో నాలో దిశానిర్దేశాలు ఇప్పుడు పాడుబడ్డ ఒక పాత్ర మన ముందు చేతులు కట్టుకుని నువ్వూ నేనూ జీవాలను అందులో పారబోశాం ఎప్పుడో ఇప్పుడు మిగిలింది కేవలం మనం అనబడే మనం మాత్రమే తీగలుగా వేలాడతాం ఒకరికొకరం ప్రశ్నార్థకాలుగా రోజులను ,సంవత్సరాలను వెనకాల పోసుకుంటాం రక్తమో చిక్కని అనిశ్చిత వీర్యమో మళ్ళా నీలానో నాలానో గడ్డకట్టి స్రవించని గర్భాశయాలు ఇరువురి తలల్లో మోస్తూనే ఉంటాం ఎవరికీ అర్థంకాము అలా ఉండిపోతాం కొన్నాళ్ళకి అయిందా అంటుకట్టడం అని నువ్వో నేనో అడగక మానం ప్రత్యర్థులూ మనమే స్నేహితులమూ మన... పూర్తిటపా చదవండి...