Blogger Templates and Widgets
Showing posts with label 'రణం('పూ'రణం). Show all posts
Showing posts with label 'రణం('పూ'రణం). Show all posts

Thursday 12 February 2015 10:04 am

" పట్టి " ప్రేమ | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - " పట్టి "  ప్రేమ

 




View the Original article

Tuesday 10 February 2015 10:43 am

క్రొత్తకాపురము | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - క్రొత్తకాపురము


పూర్వము కొన్ని ఉమ్మడి కుటుంబాలలో క్రొత్త కాపురం ఇలా...

ఆటవెలది:
అత్త చేత తిట్లు, నాడబిడ్డల మొట్లు
భర్తకు నగచాట్లు భామ ఫీట్లు
మామ మదికి తూట్లు మరిసర్దు కొనుటెట్లు
క్రొత్త కాపురమున కొన్నిపాట్లు
పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 7 February 2015 9:24 am

న ' వల ' | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - నవల


కందము:
నవనవ లాడెడి విధముగ
నవరసములతోడ మెచ్చు నాయిక మరియున్
నవలా నాయకు లుండెడి
నవలల కాలమ్ము పోయె నట 'నెట్' వలతో.
... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 4 February 2015 10:57 am

తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

“వార్ధక్యం రావడం” అంటే ఏమిటి?
ఆకారంలోని శోభనీ,
కళ్ళలోని మెరుగునీ కోల్పోవడమా?
అందం దాని అలంకారాలని కోల్పోడమా?
అవును, కానీ అవొక్కటే కాదు.

మన వికసనము కోల్పోవడమే కాదు,
మన శక్తి … మన సత్త్వము క్షీణించినట్టు అనిపించడమా?
లేక, మన శరీరంలోని ప్రతి అంగమూ
బిరుసెక్కినట్టనిపించి, ప్రతి చర్యలోనూ నైపుణ్యం తగ్గి,
ప్రతి నరం నీరసంగా కొట్టుకోవడమా?

<... పూర్తిటపా చదవండి...



View the Original article

Tuesday 3 February 2015 10:19 am

అత్త లేని కోడలు | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼


భావములోనా బాహ్యమునందునుపూర్తిటపా చదవండి...


View the Original article

Monday 2 February 2015 11:14 am

భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్ | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్



చంపకమాల:
శరణము గోరుమన్న యను జన్ముని తన్నెను, వెళ్ళిపొమ్మనెన్
మరణము లేదు నాకననుచు, మానవులెంతని మేదినీ సుతన్
మరి మరి చేరగోరు విష మానసు, రావణు, భావజాత లా
భ రతుని, జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్
పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 31 January 2015 1:37 pm

సా &quot; పాట్లు &quot; | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - సా " పాట్లు "





View the Original article

Friday 30 January 2015 12:09 pm

బాట వీడి నడచు వాడె జ్ఞాని | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - బాట వీడి నడచు వాడె జ్ఞాని 



ఆటవెలది:
అనృతము గల బాట, నావేశముల బాట
హితము గాని బాట, హింస బాట
పరులు దిట్టు బాట,పరమార్థములు లేని
బాట వీడి నడచు వాడె జ్ఞాని

... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 29 January 2015 11:08 am

బెత్తము | సమస్యల'తో'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - బెత్తము


కందము:
బత్తెము గురువది చూచును
పొత్తము మరి చూడరయ్యొ పోకిరి పిల్లల్
బెత్తము చూపిన హత్తెరి
కత్తులనే వారు చూపు, కాలము మారెన్.
... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 28 January 2015 10:21 am

పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
ఈమధ్య నాకు మూగనోము ఎవరు ఎలా చేస్తారా అన్న బృహత్సంశయం కలిగింది. మామూలుగా నాకు సందేహాలూ, సంశయాలూ రావు. వస్తే మాత్రం వాటి కథా కమామీషు ఆసాంతం తెలుసుకునేవరకూ తోచదు. అనేక విషయాలు తెలిసేయి. మూగనోము విధిగా పాటించేవారున్నారు. హెచ్చరిక – ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయములు కాపీ చేసేసి ప్రచురించేసుకోకండి. ఇవన్నీ నాఅభిప్రాయాలూ, నేను సేకరించిన అభిప్రాయాలూ కూడా విస్తృత పరిశోధన చేసి, ఋజువూ, సాక్ష్యాలతో నిరూపింపబడినవి కావు. అంచేత, ఎవరైనా ఈ అభిప్రాయాలను తమతమ టపాలలో […]పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 26 January 2015 10:25 am

శకునములు | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - శకునములు


తేటగీతి:
శకునమన్నను శనిగాదు శకునిగాదు
కన్నులదురుట, పిల్లులు కండ్ల బడుట
తలచి భయమును చెందకు కలత వలదు
హరుని దలచుచు సాగుము హాయి గలుగు.
... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday 25 January 2015 10:31 am

ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్


కందము:
కవి వర్ణించెను కథలో
యువరాణిని పట్టి తెచ్చె నొక రాక్షసుడే
జవరాలి కతడు పెట్టగ
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 7 January 2015 11:52 am

కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.


కందము:
మలమల మాడెను కడుపా
కలితోడను, వంట గదిని కలియగ జూడన్
కలవా సీసాలో, నటు 
కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.
... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 3 January 2015 10:15 am

తేలు | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - తేలు




 



View the Original article

Wednesday 31 December 2014 11:43 am

పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.


తేటగీతి:
నరుల శుద్ధులజేయగా నదిగ దిగెను
మురికి కూపమ్ము జేసెను మూర్ఖ నరుడు
బుద్ధి లేనట్టి నరునికై భువికి వచ్చి
పాపములఁ ద్రోయు గంగ పాపమ్ముఁ జేసె.
... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 30 December 2014 11:14 am

నననన నాననా ననన నానన నానన నాననా ననా | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నననన నాననా ననన నానన నానన నాననా ననా


చంపకమాల:
కనుమిది నాన్నగారు ! మరి కష్టము నాకిది చంపకమ్మనన్
వినుమిక చెప్పుచుంటి నొక వీనులవిందగు మంత్రమొక్కటే
ననుచును తండ్రి జెప్పె కన ' నా '  లను గూడిన నవ్య మంత్రమే 
" నననన నాననా ననన నానన నానన నాననా ననా " ! 
పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 29 December 2014 11:14 am

పల్లియ కన్నియ | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - పల్లియ కన్నియ






View the Original article

Sunday 28 December 2014 11:33 am

ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే


ఉత్పలమాల:
ఎగ్గులు జేయు సంఘటనల నేమియు ధర్మము దప్పకుంటచే
నుగ్గుగ జేయ కౌరవుల నూతన తేజము లొప్ప దీవెనల్
తగ్గవిధమ్ము కృష్ణుడును తాముగ శూలియు మారుతీయగా
ముగ్గురు, పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే !
పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 23 December 2014 10:42 am

రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్. | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - రారమ్మని పిల్చె సాధ్వి  రంజిల విటులన్.


కందము:
పేరేమొ ' సాధ్వి ' యామెది
హీరోయిను మోజు మీద హే ! చెన్నైకే
చేరెను, పస్తులు మాపగ
రారమ్మని పిల్చె' సాధ్వి ' రంజిల విటులన్.
... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 22 December 2014 3:21 pm

భర్త భామ యయిన భార్య మురిసె | సమస్యల'తో 'రణం('పూ'రణం)

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
 మనమూ ఈ క్రింది సర్క్యులర్ గుర్తించ వలయును.
పూర్తిటపా చదవండి...


View the Original article