పరరూపసంధి వలన ‘వేద+అండ=వేదండ’ అవుతుంది. ఇక్కడ ఉత్తరపదంలోని అచ్చుకే (అకారానికే) యతి వేయాలి. కాని ఆ అచ్చుతో కూడిన హల్లుకు (దకారానికి)కూడ కవులు యతి చెల్లించారు. కనుక వేదండ వంటి పదాలలో అచ్చుకు, హల్లుకు యతి చెల్లించవచ్చని లాక్షణికులు అంగీకరించారు. అచ్చుకు, హల్లుకు (ఉభయానికి) యతి చెల్లడంవలన ఇటువంటివాటిని ‘ఉభయయతి’ అన్నారు.
చలిగా, లోతుగా, నల్లగా కెరటాలు సాగుతుంటాయి ఎక్కడా గాలి ఊసు లేని సముద్రం మీద ఎవరికీ ఎరుకలేని ఏ చారెడు నేలకోసమో! . ఆ చీకటి అలలతరగలమీద తేలుతూ వినీ వినిపించక, శతృ, మిత్రుల శోకాలు, ఎవరికీ తెలియని ఏ నేలనో వెతుక్కుంటూ పోతాయి.
దూరాన రక్షించమంటూ విధివంచితుడెవరో అరుస్తున్నాడు; ఈ లోకంలోని బాధలనుండి విముక్తుడై మిగతావాళ్ళలాగే ఎవరికీ తెలియని తీరానికి పోతున్నాడు.
ఆ వెళుతున్నవాని వెంట కొన్ని వేల మంది పోయినా గాలి ఆడని ఆ ప్రదేశానికి, ఒంటరిగానే పోతున్నాడు, ఎవరి ఊహకీ అందని ఆ దేశానికి.