రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

రోడ్డు మీద నడుస్తున్న నేను
నన్ను పలకరించరించడానికొచ్చిన ఒక ముసురు వాన
తుంపరలన్నీ మట్టిలో తడుస్తూ తొణికిసలాడే మొసళ్ళు
ముఖం మీదో
చేతుల పైనో భళ్ళున పడి జారిపోవడం
చొక్కా జేబులో గుప్పెడు మన్నీళ్ళు
ఇంట్లోకొచ్చాక ఒక తడి వాసన తల నిమిరిన నా చేతివేళ్ళకు
చీమలు పాకిన ఆకులు పడవలై అక్కడక్కడే
బాల్కనీ అంతా నిండిన కొత్త నీళ్ళు
తడిసిపోయిన కాగితాలు పుస్తకాల్లో దాక్కుంటూ రంగులను విసిరి ఎక్కడో జల్లుతాయి
నిన్నూ నన్నూ ఒక్కసారి కదుపుతూ
పచ్చని అడవిలో అడక్కుండా కురిసిన శబ్దం
కీచురాళ్ళ సంగీతం వినబడీ వినబడకుండా
మసకగా అడుగులు మన... పూర్తిటపా చదవండి...


View the Original article