రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
అప్పుడు, నీ కన్నులు లేతెరుపును అద్దుకుంటాయి
అప్పుడు, నీ ముఖంపై మబ్బులు కమ్ముకుంటాయి
అప్పుడు

నీ శరీరంపై ఏవో చెట్లు హోరున వీయగా
ఆ చల్లటి గాలిలోనీ కాళ్ళూ చేతులకు పైగా
పక్షులూ సీతాకోకచిలుకలూ తేలిపోతాయి 

అప్పుడు
నీ చెవులలో పురాతన కథల గుసగుసలు
గుర్రాలూ, గూళ్ళూ, ఎగిరే ఎన్నెన్నో చేపలు-
నీ పెదాలపై పాల వాసనా, బుగ్గలపై మెత్తగా

ముద్దులు. మూసుకునే నీ చేతివేళ్లల్లో
ఒక తల్లి శిరోజాలు. తన కలలు నీవై
నీ కలలు తనవై, తన తనువై, వెరసి

ఒక మొగ్గ, పూవుని కావలించుకుని పడుకునే
ఒక దైనందిన ఇంద్రజాలం. చూసే నాలో
జ... పూర్తిటపా చదవండి...


View the Original article