రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
శీతాకాలపు చలిలో 
రాలే ఆకుల ముందు కూర్చుంటే
నువ్వే గుర్తుకు వచ్చావు -

రాలుతూ, గాలికి కదులుతూ
నేలపై అవి చేసే నీడల సవ్వడులే
నీ కళ్ళు.  

"ఇక ఇప్పుడు
ఎవరికి ఇవ్వను? నేను దాచిపెట్టిన
ఈ పూలను?"

అని అడుగుతావా
ఖాళీ గూడుగా మారిన ఒక ఊయల ముందు
కూర్చుని నువ్వు 

అమ్మాయీ  
కళ్ళు తుడుచుకుని, తల వంచుకుని  
కూర్చున్న వాళ్ళ ముందు

కూర్చుని
మాట్లాడగలిగే మాటలేమీ ఉండవు -
మళ్ళా వస్తాను

ఒక ఊయలతో
నీ అంత అశ్రువుతో, నీ అంత భారంతో
నీ అంత ప్రేమతో-  
... పూర్తిటపా చదవండి...

View the Original article