రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
View the Original article
చీకటి ఒక దీపంలా వెలుగుతున్న క్షణాన
ఒక్కడివే నువ్వు-
అప్పుడు ఆ రాత్రిలో
తడిచి ముద్దయిన గోడలు. గోడలపై
లోపలేవో ఊగిసలాడుతున్నట్టు
విలవిలా కొట్టుకులాడుతున్నట్టు
అటూ ఇటూ ఊగే లతలలాంటి నీడలు. వణికే నీడలు-
ఏ దారీ చేరని, నిను వీడని ఊడలు. చేతులైనా కాని
ఒక ముఖమైనా కాని, ఒక పలుకైనా
కాని కాలేని, నిన్ను వణికించే నీడలు.
రాత్రి రెక్కల కింద, వెచ్చగా పొదగనివ్వని
పడుకోనివ్వని, తల్లి లేని నీడలు
నిన్ను తండ్లాటకు గురి చేసి
నిన్ను ఆనాధను చేసే నీడలు
'నువ్వు' అనే చీకటి దీపం చుట్టూ
వలయాలుగా పరచుకునే నీడలు
... పూర్తిటపా చదవండి...
ఒక్కడివే నువ్వు-
అప్పుడు ఆ రాత్రిలో
తడిచి ముద్దయిన గోడలు. గోడలపై
లోపలేవో ఊగిసలాడుతున్నట్టు
విలవిలా కొట్టుకులాడుతున్నట్టు
అటూ ఇటూ ఊగే లతలలాంటి నీడలు. వణికే నీడలు-
ఏ దారీ చేరని, నిను వీడని ఊడలు. చేతులైనా కాని
ఒక ముఖమైనా కాని, ఒక పలుకైనా
కాని కాలేని, నిన్ను వణికించే నీడలు.
రాత్రి రెక్కల కింద, వెచ్చగా పొదగనివ్వని
పడుకోనివ్వని, తల్లి లేని నీడలు
నిన్ను తండ్లాటకు గురి చేసి
నిన్ను ఆనాధను చేసే నీడలు
'నువ్వు' అనే చీకటి దీపం చుట్టూ
వలయాలుగా పరచుకునే నీడలు
... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment