రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
చీకటి ఒక దీపంలా వెలుగుతున్న క్షణాన
ఒక్కడివే నువ్వు-

రాత్రిలో తడిచి ముద్దయిన గోడలు.
లోపలేవో ఊగిసలాడుతున్నట్టు
అటూ ఇటూ ఊగే లతలు. వొణికే నీడలు.

ఏ దారీ చేరని, నిను వీడని ఊడలు. చేతులైనా కాని
ఒక ముఖమైనా కాని, ఒక పలుకైనా
కాని, నిన్ను వణికించే నీడలు.

రాతి రెక్కల కింద, వెచ్చగా పొదగనివ్వని
పడుకోనివ్వని, తల్లి లేని నీడలు
నిన్ను తండ్లాటకు గురి చేసి
నిన్ను ఆనాధను చేసే నీడలు

'నువ్వు' అనే చీకటి దీపం చుట్టూ
వలయాలుగా పరచుకునే నీడలు
వాన సవ్వడి చేసే, కన్నీళ్ళ వాసన వేసే నీడలు
నల్లని, తెల్లని లేతేరుపు న... పూర్తిటపా చదవండి...


View the Original article