రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"నిశ్శబ్ధం అనేది ఉందా అసలు?"
అని అతను, తనని తాను ప్రశ్నించుకున్నాడు-

ఎదురుగా గోడలపై, లతల వలే జారే వాన నీళ్ళు.
ఒక పసివాడి తలని నిమిరినట్టు
నిన్ను లాలనగా నిమిరే ఓ గాలి

నీడలు లేని ఒక కాంతి అప్పుడు నీలో: నీ ప్రాంగణంలో-
మౌనముద్రలో ఉన్న బుద్ధుని
ఛాయాచిత్రాన్నేదో నీకు జ్ఞప్తికి
తెచ్చే చెట్లూ, పూలూ, ఆకులూ-

అక్కడక్కడే ఎగిరి నీ పక్కగా వాలే ఒక తూనీగ: ఇక
ఎవరో నెమ్మదిగా నీ పక్కగా చేరి
కుదురుకుని కూర్చున్నట్టున్న

సాయంత్రంలో, సరిగా అప్పుడు కొంత కలకలం. సరిగ్గా
అప్పుడు కొంత, కదలిక లేని కదలిక-
కుండీలో ప... పూర్తిటపా చదవండి...


View the Original article