Blogger Templates and Widgets
Showing posts with label ................ Show all posts
Showing posts with label ................ Show all posts

Friday, 20 March 2015 4:05 pm

కథకు బహుమతి | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 20 వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో నా కథ "కథ వ్రాయాలి" ప్రధాన విభాగంలో ఉత్తమ కథగా  ఎంపికైనందుకు సంతోషంగా ఉంది . ఎక్కడో ఓ మూల చదువుకుంటూ రాసుకుంటూ కూర్చుని ఉండే నాకు ఇంత గొప్ప గౌరవాన్ని అందజేసిన వంగూరి ఫౌండేషన్ వారికి ఎంతగా ధన్యవాదాలు చెప్పినా తక్కువే . ఈ బహుమతి ద్వారా నాలోని ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింపజేసిన వంగూరి ఫౌండేషన్ వారికి హృదయపూర్వక నమస్సులు . పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 11 February 2015 5:25 pm

వాళ్ళిద్దరూ | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
కలపబడిన ఏ దారుల మధ్యనో ఎదురుపడతారు  వాళ్ళు
చూపుల్లోంచి ఆకర్షణ దొర్లించుకుంటూ
పెదాల మీద రేగిన నవ్వు దుమారం
ఒకరి కళ్ళలో మరొకరు పోసుకుంటూ

అప్పుడు జనిస్తుంది  ఓ ఇష్టం
వాళ్ళ హృదయాల్లోకి కొంత కాంతిని తోడి పెడుతూ
తూరుపు గుండెల మీద తేరిన ఉదయంలా
వాళ్ళ చెంపల నిండా అరుణ వర్ణమే

మాటలెన్ని మార్చుకున్నా తీరని దాహాన్ని ఏమార్చుకుంటూ
సమూహాల మధ్య నించి ఏకాంతాల్ని ఏరుకుంటారు
తమ కోసమే కరిగే కొ... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 10 February 2015 10:38 am

నేను, నా రెండు బందీలు | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నడక నాదే 
కానీ నా అడుగులు మాత్రం ఆ దారికి బందీలు 
ఎంతెంత నురగాలుగా పరుగులు కక్కినా 
నన్ను నాలోకి  తరుముతుంటాయి ఆ రెండు చేతులూ 
ఉక్రోషంగా అంటాను  
నేనేమీ పడిపోనులే అని 
నా రెండు పంజరాలూ విశాలంగా నవ్వుతాయి 
నేనెప్పుడో స్వేచ్ఛగా ఎగిరి వాలినప్పుడు 
కూలిన చెట్టునో , జాడ పట్టిన మట్టినో  చూపిస్తూ !!
... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 7 February 2015 9:20 pm

నిత్యమై నిఖిలమై (ఫిబ్రవరి 2015 విపుల ముషాయిరాలో ) | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............

... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 28 January 2015 9:42 pm

మనసుల కాలబిలాల్ని వెలిగించే ఇంటర్ స్టెల్లార్ | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఇప్పటివరకూ ఇంటర్ స్టెల్లార్ గురించిన సమీక్షలూ విశ్లేషణలూ అక్కడా అక్కడా కనిపించినా చదివే ప్రయత్నం చెయ్యలేదు . ఎందుకంటే ఎప్పటికైనా ఆ చిత్రం ఫ్రెష్ మైండ్ తో , ఏమీ తెల్సుకోకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో .(ఎవరికైనా అటువంటి ఆలోచన ఉంటే  ఈ విశ్లేషణ చదవకపోవడం మంచింది ) చాలా మంది ఈ చిత్రం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమని అభిప్రాయపడినా ఎందుకు అర్థమవదన్న మొండితనంతో , ఎంతో కొంత అర్థమయే తీరుతుందన్న నమ్మకంతో చూడటం మొదలు పెట్టాను . 

పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 24 January 2015 11:04 pm

'ఆత్మ'సందేశం ( కథ) | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
చల్లటి గాలి ముఖాన్ని రివ్వున తాకుతోంది . పక్కనించి ఒకటీ అరా లారీలు వేగంగా దూసుకు పోతున్నాయి. ఆకాశమంతా మేఘాల్తో నిండిపోవడం వల్ల హెడ్ లైట్స్ వెలుగులో రోడ్డు నల్ల త్రాచులా కనిపిస్తోంది . కార్తిక్ బైక్ హుషారుగా  పోనిస్తున్నాడు . "మేఘాలలో తేలి పొమ్మన్నది .. తూఫానులా రేగి పొమ్మన్నది .. అమ్మాయితో సాగుతూ చిలిపి మదీ ..." చెవుల్లో గుచ్చుకున్న హెడ్ ఫోన్స్ లోంచి పాట గట్టిగా వినిపిస్తోంది . ఇప్పుడు తన వెనుక కూడా తనని గట్టిగా హత్తుకుని ఎవరైనా అమ్మాయి కూర్చుని ఉంటే ఎంత బాగుండేది ! తన ఆలోచనకి తనే న... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 22 January 2015 5:31 pm

ఆమె చెప్పిన అతని కథ. ( The Theory of Everything) | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
అంతో ఇంతో చదువుకున్న ప్రతివారికీ స్టీఫెన్ హాకింగ్ పేరు తప్పక తెలుస్తుంది   అతనో గొప్ప మేధావి . భౌతిక శాస్త్ర రంగంలో అతను చేసిన కృషి ,పరిశోధన అసామాన్యం . ఒక ఫిజిసిస్ట్ గానే కాక ఫిజిక్స్ ని ఎంతో సులువుగా అందరికీ  అర్థమయ్యే రీతిలో వివరించిన రచయితగా... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 6 January 2015 10:11 pm

ఇష్టం | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఒకరంటే ఇష్టమని చెప్పడం ఎంత కష్టమో ఇష్టం లేదని తెలిసేలా చెయ్యడం అంత సులువు 
... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 10 December 2014 12:09 pm

మచ్చ లేని చందమామ (కథ ) | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
 "ఇవ్వాళ కొత్త డిజీన్ పెట్టు " అంది శైలజ పరికిణీ దగ్గరగా పట్టుకుని పక్కన కూర్చుంటూ .
"అయ్యో , నేనింకా  'అప్పుడెప్పుడో ఒకప్పుడు' ఏం జరిగిందో చెబుదామనుకున్నానే " అంది సీత గోరింటాకు కొబ్బరి చిప్పలో సర్దుతూ . 
పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 8 December 2014 10:06 pm

అసలు నాకేమొచ్చు | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఆకాశప్పడవ మీద  అక్షరాల్తో తెడ్లు వేస్తూ 
అంతరిక్షంలోకి అలవోకగా తీసుకెళతారు వాళ్ళు 
ఎక్కినప్పుడల్లా  ఉలికిపాటే ...  అసలు నాకేమొచ్చు?
పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 17 November 2014 12:24 pm

'రుచి' లేని జీవితమే జీవితం (కథ ) | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
"మమ్మీ , నాకు తాత త్లైన్  కావాలి "
శిరీష కి వాడేమంటున్నాడో ముందు అర్ధం కాలేదు . "ఆడుకో నాన్నా ,విసిగించకుండా " అంది కూర ముక్కలు మగ్గాయో లేదో చూస్తూ . 
"నాకు తా...త  త్లైన్ కావాలి " గట్టిగా చెప్పాడు ఈ సారి,కావాల్సిందే అన్నట్టుగా . 
పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 11 November 2014 8:18 pm

మళ్ళీ ఎప్పుడొస్తానో !( కథ ) | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నేను అక్కడ అందరికీ కొంచెం దూరంగా నిలబడి ఉన్నాను . అక్కడ ఉన్న అందరి ముఖాలూ చాలా గంభీరంగా ఉన్నాయి . శవం పక్కన కూర్చుని ఉన్న నలుగురైదుగురు ఆడవాళ్ళు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు . ఆ వాతావరణం లోని విషాదానికి  గాలి కూడా కదలడానికి భయపడినట్టుగా స్థంభించి పోయింది . ప్రకృతి లోని వర్ణాలన్నీ ఎటు పోయాయో తెలీనంతగా ఆ ప్రాంతమంతా అదో విధమైన మసకదనం కమ్ముకుని ఉంది . 
ఒక్కొక్కరు గా ఇంకా బంధువులు, స్నేహితులు, దుఃఖంతో, బాధతో , సానుభూతితో పరితపించిపోతూ కా... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 8 November 2014 4:58 pm

నెయ్యి , షుగర్ అవసరం లేని తియ్యని కారట్ రోల్స్ | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
స్వీట్ స్టాల్స్ లో ఐదారు వందలు పెట్టి కొనుక్కునే స్వీట్స్ కంటే ఏ మాత్రం తక్కువ రుచి గా ఉన్నా తప్పకుండా అడగండి . తేనె వేస్తాం కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్ళకి పనికి రాదు గానీ బరువు పెరుగుతామనో , ఆరోగ్యానికి మంచిది కాదనో ఎంత ఇష్టమైనా స్వీట్స్ తినడానికి ఆలోచించే వాళ్ళకి ఇది అమృతంతో సమానం . ఎన్ని తిన్నా పర్లేదు . 
సొంత రెసిపీ కాదు సుమా . మంతెన గారు చెప్పిందే. 
పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 4 November 2014 3:46 pm

అద్దం లోపల | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
కనురెప్పల అడుగున చేప పిల్లల్లా ఎన్నెన్ని కలలో .... 
వలేస్తే  దొరకుతాయనుకోకు  
వడి వడి గా జ్ఞాపకాల్లోకి జారిపోయాయెప్పుడో    
పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 1 November 2014 4:59 pm

మరపురాని బంధం (కథ ) | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
                                                                                                 మరపురాని బంధం 

"అమ్మాయ్ , ఈ రోజు పంచమే కదూ " అన్న మాటలకి లంచ్ బాక్స్ సర్దుతున్న మాధవి ఉలికిపడి తలెత్తి చూసింది . 
స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయి  తొందర తొందరగా హోమ్ వర్క్ పూర్తి చేస్తున్న పదేళ్ళ సిరి రాయడం ఆపేసి ఆమె వైపే చూస్తో... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 29 October 2014 10:03 am

అలా చేస్తారెందుకో | మధురోహల పల్లకి లో ...............

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! పరీక్షిన్నరేంద్రుని వంశ వృక్షాన్ని తిలకించండి.


View the Original article

Wednesday, 22 October 2014 10:08 am

మధురోహల పల్లకి లో ............... : ఎదగనిదెవరు

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
అందరిలాగా ఉండను నేను
కానీ అందరూ కావాలనుకుంటాను 

నేను కనిపించగానే 
తదేకంగా చూస్తారు అందరూ 
ఎంతో సంబరపడి పోతాను 

పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 18 October 2014 2:19 pm

మధురోహల పల్లకి లో ............... : హైదర్ ప్రయాణం లోపలి వైపుకా ?

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఎప్పుడో పదహారో శతాబ్దం లో షేక్ స్పియర్ క్లిష్టమైన మానవ సంబంధాల ఎస్సెన్స్ జల్లి  హామ్లెట్ ని ఎంత చిక్కగా వండి వార్చాడో  విశాల్ భరద్వాజ్ కూడా పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 13 October 2014 10:04 pm

మధురోహల పల్లకి లో ............... : ఉండీ లేకపోవడం

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఉండీ లేకపోవడం అంటే ఏమిటి 
కళ్ళలోంచి కన్నీరు చిలకనివ్వకపోవడమా 
నవ్వాలన్న కోరికని నిలువునా చంపుకోవడమా 

పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 6 October 2014 5:07 pm

మధురోహల పల్లకి లో ............... : రహస్యం (కథ )

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఆదివారం సాయంత్రం  తీరిగ్గా కూర్చుని  టీవీ చూస్తుంటే సెల్ ఫోన్ మోగింది . ఎవరా అని చూస్తే పరమేశు .
“శేఖర్ గాడి రహస్యం తెలిసిపోయింది రా “  ఫోన్ లిఫ్ట్ చెయ్యడంతోనే  ఉద్విగ్నంగా అన్నాడు వా... పూర్తిటపా చదవండి...


View the Original article