Blogger Templates and Widgets
Showing posts with label రామాయణం. Show all posts
Showing posts with label రామాయణం. Show all posts

Sunday 1 March 2015 10:59 am

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ఉచ్చైశ్శ్రవం తరువాత ఐరావత మనే ఏనుగు ఆవిర్భవించింది . నాలుగు దంతాల ఐరావతం వెండికొండవలె వెలుగుతూ కనిపించింది .

తడలేని వడపు గల యొడలును బెను నిడుదకరము నురుకుంభములున్
బెడగై యువతుల మురిపపు ,నడకలకున్ మూలగురువనన్ గజ మొప్పెన్

పెద్ద కుంభ స్థలం , పొడవైన తొండమూ , అందమైన నడకా ఆ గజరాజు స్వంతం . యువతులు ఈ గజపు నడకలు చూసి కులుకుతూ నడవడం నేర్చుకున్నారట . అందుకే ఇది తరుణులకు నడక నేర్పిన మూలగురువు .

ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై , యింద్రు విరులతోట కేపుదెచ్చి
పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 28 February 2015 3:20 pm

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

న తాః మ పరిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః
అప్రతిగ్రహాణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః

వరుణస్య తతః కన్యా వారుణీ రఘునందన
ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహం

దితేః పుత్రా న తాం రామ జగృహుర్వరుణాత్మజాం
అదితేస్తు సుతా వీర జగృహుస్తామనిందితాం

అసురాస్తేన దైతేయాః సురాస్తేనాదితేః సుతాః
హృష్టాః ప్... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 26 February 2015 6:18 pm

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

అథ వర్ష సహస్రేణ సదణ్డః స కమణ్డ్లుః
పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చశః
అప్సు నిర్మథనాదేవ రసాత్తస్మాదరస్త్రియః
ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసో భవన్

షష్టిః కోట్యో భవంస్తా సామప్సరాణాం సువర్చసాం
అసంఖ్యేయాస్తు కాకుత్స్థ యాస్తాసాం పరిచారికాః

అటు పిమ్మట వేయి సంవత్సరాలు సముద్రమథనం సాగింది . అప్పుడు పాల సముద్రంలో నుండి దండ కమండలాలు ధరించి ఉద్భవించాడు ధన్... పూర్తిటపా చదవండి...

View the Original article

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

Interestingly there exists a hillock in Bhagalpur district of Bihar which the locals believe as mount Mandara , the mountain used for churning the milky ocean . The height of this hillock is less than eight hundred feet and it appears to be a granite monolith . In his magnum opus Kumara sambhava , Kalidasa refers to the foot marks of Lord Vishnu on the slopes of Mandara hill .

This place incidentally is also the famed kingdom of Anga ruled by the legendary warrior Karna Who is known for his charity , valour ,and friendship .

పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 24 February 2015 9:40 am

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

భాగవతం : ” ఇల్లలుకగానే పండుగ కాదన్న” సామెత చందంగా సముద్ర మథనం మొదలయింది కానీ పాలసముద్రంలోనుండి  అమృతం పుట్టలేదు . అందరి గుండెలవిసేలా హాలాహలం పుట్టింది . మథనం చేస్తున్న దేవతలూ , రాక్షసులూ భయపడి , వాసుకిని వదలి పెట్టి పారిపోయారు .ఆ హాలాహలం లక్షసూర్యుల కాంతి కలిగి చూడడానికి కూడా అలవికానటువంటిది . ముక్కంటి కంటిమంట కంటే వంద రెట్లు భయంకరమైనది . ప్రళయ కాలపు రాత్రి  మేఘాల మధ్యలో మెరిసే పిడుగులవలె భయంకరమైనది . అతి త్వరగా ఆ మహావిషం ఆకాశంలోకి ఎగబాకింది . మందర పర్వతాన్ని దాటి సముద్రమంతా వ్యాపించింది . కొండ గుహలలోకి పాకి పోయింది . వెళ్ళిన చోటల్లా బూడిద మాత్రమే మిగిల్చింది .

పెనుమంటల ధాటికి తట్టుకో... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 20 February 2015 11:09 am

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

అథ వర్ష సహస్రేణ యోక్త్రసర్పశిరాం సి చ
వమంత్యతివిషం తత్ర దదంశుర్దశనైః శిలాః

ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహలమహావిషం
తేన దగ్ధం జగత్సర్వం స దేవాసురమానుషం

అథ దేవా మహాదేవం శంకరం శరనార్థినః
జగ్ముః పసుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్టువుః

క్షీరసాగర మథనం మొదలు పెట్టి వేయి సంవత్సరాలు గడిచాయి . కవ్వపు త్రాడైన వాసుకి తలలనుండి విషం వెలువడింది . వాసుకి తన దంతాలతో మంథ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 14 February 2015 10:10 am

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU
ఆ లలితాంగి గనుంగొనెబాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.

కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమోతలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పరస్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్రజ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్

భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం . పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి . బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారిగా మతిపోయింది . ” ఇది కలా ! నిజమా !... పూర్తిటపా చదవండి...



View the Original article

Thursday 12 February 2015 10:07 am

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ఒకానొక సమయంలో రాక్షసుల బలం మితిమీరి పోయింది . దైత్యులు  దేవతలను జయించి వారిని కష్టాల పాలు చేసారు . అప్పుడు దేవేంద్రుడు తన ముఖ్య అనుచరులతో మేరు పర్వతం మీద నివశించే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు . రాక్షసుల దుండగాలను పరమేష్టికి తెలిపాడు . ఇల్లూ వాకిలీ వదలి తన వద్దకు వచ్చిన దేవతల కష్టాలను చూచి చలించిపోయాడు పితామహుడు . ఏమి చేయాలో తోచలేదు . ఆర్తితో , దేవతల శత్రువులను తపింప జేసే విష్ణుమూర్తిని ప్రార్థించాడు . మార్గం కనిపించింది . ముఖ కమలం వికసించింది . చిరునవ్వుతో ” విష్ణు మూర్తి మాత్రమే మనలను రక్షించడానికి సమర్థుడు అతని శరణు వేడుదాము” అని దేవతలను ఊరడించి , అందరూ కలిసి వైకుంఠవాసుని దర్శనానికి వెళ్ళా... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 11 February 2015 3:40 pm

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

పూర్వం కృతయుగే రామ దితేః పుత్రా మహా బలాః
అదితేశ్చ మహాభాగ వీర్యవంతః సుధార్మికాః

తతస్తేషాం నరశ్రేష్ట బుధ్ధిరాసీన్ మహాత్మనాం
అమరా అజరాశ్చైవ కథం శ్యామ నిరామయాః

తేషాం చింతయతాం రామ బుధ్ధిరాసీన్మహాత్మనాం
క్షీరోదమథనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై

రామా ! కృతయుగంలో దితి పుత్రులూ (దేవతలు ) , అదితి పుత్రులూ (రాక్షసులు ) కలిసి ఉండేవారు . బలమూ , వీర్యమూ ,ధార్మికతా వారి సొత్తు .అందరూ కలిసి మెలసి జీవిస్తూ స్నేహంగా ఉండే వారు . వారికి జరా మరణాలూ , రోగాలు లేని జీవితం కావాలనిపించింది . మరణమూ ,ముసలితనమూ రాకుం... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 10 February 2015 10:11 am

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః
సంతారం కారయామాస సర్షి సంఘః సరాఘవః

ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా
గఙ్గాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీం

తతో మునివరస్తూర్ణం జగామ సహ రాఘవః
విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా

రామచంద్రుడు వినయంగా గంగా నదిని దాటడానికి సమయమాసన్నమైనదని తెలుపగానే తనతో వచ్చిన ఋషులకూ ,రాఘవునికీ బయలుదేరమని ఆనతి ఇచ్చా... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 9 February 2015 10:39 am

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

విశ్వామిత్ర వచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః
విస్మయః పరమం గత్వా విశ్వామిత్ర మథ బ్రవీత్

అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా
గఙ్గావతరణం పుణ్యం సగరస్యాపి పూరణం

తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా
జగామ చింతయానస్య విశ్వామిత్రకథాం శుభాం

విశ్వామిత్రుని వచనాలు విన్న రామలక్ష్మణులు విస్మయులయ్యారు . ” బ్రహ్మర్షీ ! గంగావతరణ కథ , గంగా జలాలు సాగరాన్ని పూరి... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 3 February 2015 10:04 am

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

పూర్వకేణ హి తే రాజంస్తే నాతి యశసా తదా
ధర్మిణాం ప్రవరేణాపి నైష ప్రాప్తో మనోరథః

తథైవాంశుమంతా తాత లోకే అప్రతిమ తేజసా
గఙ్గాం ప్రార్థయతా నేతుం ప్రతిజ్ఞా నాపవర్జితా

రాజర్షిణా గుణవతా మహర్షి సమతేజసా
మత్తుల్య తపసా చైవ క్షత్రధర్మ స్థితేన చ

దిలీపేన మహాభాగా తవ పిత్రాతి తేజసా
పునర్న శకితా నేత... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 29 January 2015 5:03 pm

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః
గఙ్గా సంప్లావయామాస యజ్ఞవాటం మహాత్మనః
తస్యావలేపనం జ్ఞాత్వా క్రుధ్ధో యజ్వా తు రాఘవ
అ పిబచ్చ జలం సర్వం గఙ్గాయాం పరమాద్భుతం

అంతా సుఖమయమవుతోంది అని అనుకుంటున్న సమయంలో ఉరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న గంగా నది మార్గాన జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చింది . ఆశ్రమంలోని యజ్ఞవాటాన్ని పావన గంగా జలాలు ముంచెత్తాయి . జహ్ను మహర్షి మహాత్ముడు . తన ఆశ్రమం తన ముందే గంగానదిలో కలిసి పోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు . గంగ గర్వాన్ని అణచివేయాలనుకున్నాడు . హుంకరించి నోరు తెరిచాడు . అంతే ! ప్రవహిస్తున్న ఆ గంగా జలం అద్భుతంగా మహాత్ముని ఉదరంలోకి వెళ్ళి పోయింది . భగీరథుని ప్రయత్న... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 31 December 2014 4:08 pm

రామాయణం | RAMAYANAMU

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తదద్భుత తమం లోకే గంగాపతన ముత్తమం
దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః
సంపతద్భిః సురగణైస్తేషాం చా భరణౌజసా
శతాదిత్య మివాభాతి గగనం గతతోయదం
శింశుమారోరగగణైః మీనైరపి చ చంచలైః
విద్యుద్భిరవ విక్షిప్త మాకాశమ భవత్తదా

తేజోమయులైన దేవతలందరూ గగావతరణాన్ని చూడడానికి వచ్చారు . ఆ దేవతల శరీర కాంతి చేతా , వారు ధరించిన ఆభరణాల కాంతి చేతా ఆ ప్రదేశం శతసూర్య కాంతులతో మెరిసింది . ఆకాశం విద్యుల్లతలతో , జ్యావల్లీ ధ్వనులతో విక్షిపతమయింది (నిండిపోయింది ) .
మనో నేత్రంతో చూసి వర్ణిస్తున్నాడు కౌశికుడు . దాన్ని యథాతథంగా మనకందిస్తున్నాడు ప్రాచేతసుడు . ఈ దృశ్యాన్ని ఎందరో కవులు వర్ణించారు . పుణ్యుడు పో... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 29 November 2014 4:26 pm

యోగా పధ్ధతి--సంక్షిప్త రామాయణం | Kriya Yoga Sadhana

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
                       సంక్షిప్త రామాయణం



View the Original article

Monday 17 November 2014 4:57 pm

సంక్షిప్త రామాయణం | Kriya Yoga Sadhana

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
                                          


View the Original article