భాగవతం : ” ఇల్లలుకగానే పండుగ కాదన్న” సామెత చందంగా సముద్ర మథనం మొదలయింది కానీ పాలసముద్రంలోనుండి అమృతం పుట్టలేదు . అందరి గుండెలవిసేలా హాలాహలం పుట్టింది . మథనం చేస్తున్న దేవతలూ , రాక్షసులూ భయపడి , వాసుకిని వదలి పెట్టి పారిపోయారు .ఆ హాలాహలం లక్షసూర్యుల కాంతి కలిగి చూడడానికి కూడా అలవికానటువంటిది . ముక్కంటి కంటిమంట కంటే వంద రెట్లు భయంకరమైనది . ప్రళయ కాలపు రాత్రి మేఘాల మధ్యలో మెరిసే పిడుగులవలె భయంకరమైనది . అతి త్వరగా ఆ మహావిషం ఆకాశంలోకి ఎగబాకింది . మందర పర్వతాన్ని దాటి సముద్రమంతా వ్యాపించింది . కొండ గుహలలోకి పాకి పోయింది . వెళ్ళిన చోటల్లా బూడిద మాత్రమే మిగిల్చింది .
పెనుమంటల ధాటికి తట్టుకో... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment