రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ఒకానొక సమయంలో రాక్షసుల బలం మితిమీరి పోయింది . దైత్యులు  దేవతలను జయించి వారిని కష్టాల పాలు చేసారు . అప్పుడు దేవేంద్రుడు తన ముఖ్య అనుచరులతో మేరు పర్వతం మీద నివశించే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు . రాక్షసుల దుండగాలను పరమేష్టికి తెలిపాడు . ఇల్లూ వాకిలీ వదలి తన వద్దకు వచ్చిన దేవతల కష్టాలను చూచి చలించిపోయాడు పితామహుడు . ఏమి చేయాలో తోచలేదు . ఆర్తితో , దేవతల శత్రువులను తపింప జేసే విష్ణుమూర్తిని ప్రార్థించాడు . మార్గం కనిపించింది . ముఖ కమలం వికసించింది . చిరునవ్వుతో ” విష్ణు మూర్తి మాత్రమే మనలను రక్షించడానికి సమర్థుడు అతని శరణు వేడుదాము” అని దేవతలను ఊరడించి , అందరూ కలిసి వైకుంఠవాసుని దర్శనానికి వెళ్ళా... పూర్తిటపా చదవండి...

View the Original article