Blogger Templates and Widgets
Showing posts with label భీమఖండ. Show all posts
Showing posts with label భీమఖండ. Show all posts

Monday, 17 November 2014 12:54 pm

శ్రీనాధుని భీమఖండ కధనం -25 తృతీయాశ్వాసం -10 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -25 తృతీయాశ్వాసం -10 భీమేశ్వర కళ్యాణ మండపానికి తూర్పున వెయ్యి కోట్ల చంద్ర బింబాల కాంతితో ఆకాశం అంటేట్లున్న ‘’భానుజ ధారమంటపం ‘’ఉంది .భీమేశ్వర అట్టహాసం లాగా తెల్లగా అది మెరుస్తోంది .మునులు దాన్ని చూశారు .ఆలయం వెలుపల సిద్ధమునులైన అగస్త్య వ్యాసులు భీమేశ పరివార దేవతలను దర్శించి నమస్కరించారు .ఉత్తరాన ఉన్న దండపాణి రూప పరమేశునికి ప్రణామం చేశారు .చేతిలో బెత్తాలతో ఉన్న వేత్ర హస్తులను చూసి పారిపోయే ఇంద్రాది దేవతలను చూసి పారిపోయిన చోటు ‘’మోసల ‘’ చూశారు మహర్షులు మహాద్వారం నుండి ప్రవేశించి ప్రదక్షిణం చేస్తుండగా ప్రాకారమండపం లో హిమ వంతుని ప్రియ పుత్రిక భీమేషుని పత్ని పరమేశ్వరిని సందర... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 6 November 2014 5:49 pm

శ్రీనాధుని భీమఖండ కధనం -14 ద్వితీయాశ్వాసం -7 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -14

ద్వితీయాశ్వాసం -7

రోటిలో తల పెట్టి రోకటి పోటుకు వెరచినట్లుంది మునుల పని .ఈ రోజూ నిన్నటి లాంటిదే .ఆపోశనమే కాని అన్న ప్రాశన కనిపించ ట్లేదనుకొన్నారు .ఇంతలో గృహిణి వచ్చి అందరి చేతిలో ఆపోశన జలంపోశారా అని అడిగి ‘’స్వాములూ !ఇప్పటికే పొద్దు చాలా పోయింది .ఇక ఆరగించండి ‘’అన్నది .’’అమృతమస్తు’’ అని రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది .

’’ఆ ముత్తైదువ యాజ్న విప్ర నికరం బాపోసనం బెత్తినన్-సామర్ధ్యం బది ఎట్టిదో నిఖిలమున్ సంపూర్ణమై ,పాత్ర్తపా

త్రీ మధ్యంబున బిండి వంటకముం దివ్యాన్నముల్ షడ్రసీ –సామగ్రీ రుచి మత్పదార్ధ చయముల్ సందిల్లె నొక్కుమ్మడిన్’’

ఆ ముత... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 5 November 2014 9:35 pm

శ్రీనాధుని భీమఖండ కధనం -13 ద్వితీయాశ్వాసం -6 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -13

ద్వితీయాశ్వాసం -6

ఆ ఇల్లాలి మాటలు చెవులకు అమృతపు సోనలైనాయి వ్యాసునికి .ఆనందం కట్టలు తెంచుకొంది .ఇన్నాళ్ళకు మ్రుస్తాన్న భోజనం చేసే అవకాశం వచ్చిందని ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అయినా లోపలేదో సందేహం గా ఉంది తన మనో భావాన్ని ఆమెకు ఇలా తెలియ జేశాడు –

‘’తల్లీ !ఇన్ని దినాలకేనియు సుధా ధారా రసస్యందియై –యుల్లంబున్ సుఖియింప జేయు పలు కేట్లో వింటి నివ్వీటిలో

బెల్లాకొన్న కతాన నేనోకడనే భిక్షానకున్ వత్తునో –యెల్లన్ శిష్యుల గొంచు వత్తునో నిజం బేర్పాటుగా జెప్పుమా ?’’ అని అడిగాడు –భావం –అమ్మా !ఇన్ని రోజులకు ఈ కాశీ  పట్టణం అమృత సదృశమై,మనసుకు సంతోషం కలిగించే మాట విన... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 30 October 2014 5:33 pm

శ్రీనాధుని భీమఖండ కధనం -7 ద్వితీయాశ్వాసం – 2 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -7

ద్వితీయాశ్వాసం –  2

చంద్రోదయ వర్ణన

‘’ఆతత లీల గోమల నవామ్శుక పాళిమ హాంధ కార సం –ఘాతము మీటే నద్భుతముగా శశి లాంచను డభ్రవీదికిన్

శ్వేత వరాహ మూర్తి యగు వెన్నుడు ప్రన్నని యొంటి కోర,ధా –త్రీతల మెంత యంతయు ధరిం చిన యట్టి విజ్రుమ్భణంబు నన్’’-అంటే –విష్ణువు వరాహావతారం ఎత్తి తెల్లగా ఉన్న ఒకే ఒక్క కోరతో భూగోళాన్ని అంతటిని అవలీలగా పైకెత్తి నట్లు చంద్రుడు నెల వంకచేత ఆశం లో చీకట్లను అద్భుతం గా తొలగించాడు .యెర్ర దనం తో ఉన్న అర్ధ చంద్ర బింబం తాంబూలం వేసుకోవటం వలన యెర్ర బడ్డ తూర్పు దిక్కు అనే స్త్రీ యొక్క కింది పెదవిలాగా ఉన్నదట .శ్రీనాధుడు మహా శివ భక్తుడు కన... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 27 October 2014 1:23 pm

శ్రీనాధుని భీమఖండ కధనం -4 ప్రధమాశ్వాసం -3 | సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -4

ప్రధమాశ్వాసం -3

దక్షారామాన్ని ఆనుకొని సప్త గోదావరి ప్రవహిస్తోంది .అందులో ఏనుగులు హాయిగా జలక్రీడలు చేస్తున్నాయి .అవి తొండా లతో పైకి చిమ్మిన నీటి  తుంపురులు  ఆకాశాన్ని  అంటు తున్నాయట. ఆ తుంపురులకు ఆకాశం లో విహరించే దేవ ,గాంధర్వ అప్సరస స్త్రీల చను దోయిపై పూసుకొన్న శ్రీ గంధం కరిగి తెల్లబడిందట .నదిలోని బంగారు చెంగల్వ పూల మకరందాన్ని ఆస్వాదించి తుమ్మెదలు మదించి కదలలేక పోతున్నాయట .కదిలే నది నీటి తరంగాలు అనే ఉయ్యాలల లేక్కి హంసలు ఆనందం తో క్రేంకారం చేస్తున్నాయట .తీరం లో ఉన్న మామిడి ,జాజి ,పొగడ ల పొదరిళ్ళు భూమిని కప్పేస్తున్నాయట. నదీ ప్రవాహం లో హంసలతో పాటు కొంగలూ... పూర్తిటపా చదవండి...

View the Original article