రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -4

ప్రధమాశ్వాసం -3

దక్షారామాన్ని ఆనుకొని సప్త గోదావరి ప్రవహిస్తోంది .అందులో ఏనుగులు హాయిగా జలక్రీడలు చేస్తున్నాయి .అవి తొండా లతో పైకి చిమ్మిన నీటి  తుంపురులు  ఆకాశాన్ని  అంటు తున్నాయట. ఆ తుంపురులకు ఆకాశం లో విహరించే దేవ ,గాంధర్వ అప్సరస స్త్రీల చను దోయిపై పూసుకొన్న శ్రీ గంధం కరిగి తెల్లబడిందట .నదిలోని బంగారు చెంగల్వ పూల మకరందాన్ని ఆస్వాదించి తుమ్మెదలు మదించి కదలలేక పోతున్నాయట .కదిలే నది నీటి తరంగాలు అనే ఉయ్యాలల లేక్కి హంసలు ఆనందం తో క్రేంకారం చేస్తున్నాయట .తీరం లో ఉన్న మామిడి ,జాజి ,పొగడ ల పొదరిళ్ళు భూమిని కప్పేస్తున్నాయట. నదీ ప్రవాహం లో హంసలతో పాటు కొంగలూ... పూర్తిటపా చదవండి...

View the Original article