రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
రెండు చేతులా సాగినంతమేరకి బార చాపి ధరణితల్లిని ఆప్యాయంగా ఆలింగనము చేసుకుంటున్నట్టు ఆ వేళ్ళు! ఆత్మానందంకోసం అంగలారుస్తున్నాయో, మరింత దూరం సాగాలని పరితపిస్తున్నాయో కానీ చూపరులకు మాత్రం ఆ వేరులతీరు కన్నులపండువుగా ఉంది.  ఏ కావ్యకన్యక శిరోభాగముననో చెలువొందు కురుసంపదవలె గంగమ్మజాతరనాటి జనసందోహంవలె ఉక్కిరిబిక్కిరిగా గర్భకుహరాలలోకి విస్తరించిన వేళ్ళు ఇటువైపునా, ఎక్కు పెట్టిన బాణాల్లా వినువీధిఎద లోలోపలికి చొచ్చుకుపోతున్న కొమ్మా రెమ్మా, వాటినంటి చివుళ్ళూ, ఆ చివుళ్ళకి సుకుమారమైన నిగారింపు చేర్చి మిలమిల మెరుస్తున్న వెలుగురేఖలూ అటువైపునా! […]... పూర్తిటపా చదవండి...

View the Original article