మనము నమ్ముకొనే దైవమును కానీ గురువును కానీ ఎవరినైనా కానీ పూర్ణ విశ్వాసము తో నమ్మి ఆయననే అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని అనాలి. అప్పుడు అయన మనకు దారి చూపిస్తాడు. ఈ విషయము ఒక సారి పరిశీలిద్దాము. కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు గెంతుతూ ఉంటుంది. ఆ సమయము లో కోతి పిల్ల, కోతి కడుపుని పట్టుకొనే ఉంటుంది. పొరపాటున కోతి పిల్ల పట్టు వదిలి పై నుంచి క్రింద పడిపోతే, కోతి క్రిందకు దిగి రాదు. కోతి పిల్ల తనకు తాను పైకి ఈ కొమ్మా, ఆ కొమ్మా పట్టుకొని తన తల్లి దగ్గిరకి వెళ్ళాలి. తన పిల్ల తన దగ్గర కు వచ్చే...
పూర్తిటపా చదవండి...