ముందు రోజు చెప్పినట్టుగానే తెల్లారి ఉదయం ఆరున్నరకల్లా వచ్చేసాడు అశోక్. నానమ్మ ఇంటికి ప్రయాణం కట్టే ఉత్సాహంలో పూజ అంత ఉదయాన్నే పేచీల్లేకుండా నిద్రలేచింది.
ఏడింటికల్లా విజిత, పూజలని తీసుకుని శరత్ ఊరికి బయలుదేరాడు. నీలూ, మేఘ దగ్గరుండి అందర్నీ సాగనంపారు.