Blogger Templates and Widgets
Showing posts with label ||ముందుమాట. Show all posts
Showing posts with label ||ముందుమాట. Show all posts

Tuesday, 7 October 2014 6:32 pm

తూరుపుగోదారి : ||ముందుమాట -5||

రచన : kaasi raju | బ్లాగు : తూరుపుగోదారి

ఏం దాచిందని వెన్నెల్ని అలా నిందిస్తున్నావ్? బోల్డంత ఆకాశంకింద ఇంకా బోల్డంత భూమి దానిమీద మనం తిరిగిన ఓ ఊరు, ఇంకా పెద్ద చింతచెట్టు. అవన్నీ ఆ రాత్రి మనం లెక్కేసుకున్నవే కదా! దోమ కుడుతుందని ఆ వోని ఇటివ్వు అనడుగుతుంటే నిజంగా నిన్ను కుట్టేది దోమకాదని వెన్నెల వేడెక్కించిన ఆలోచననీ ఆ వెన్నెలనీ నన్నూ నిందించావ్. నా పక్కకు జరిగి చెట్లకు చలేయదా అంటే అవి గాలిని కప్పుకుంటాయన్నాను. మరి గాలికీ? అనడిగితే అది చెట్లను ఇలా చుట్టేసుకుంటుందనీ చేసి చూపించాను. చెట్లకు నాలా ఊపిరాడక పోతేనో అనడిగావ్. గాలి నాఅంత మొరటుది కాదులేవే అన్నాను.

చీకటి మీద ఆ చెరువుగ... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 1 October 2014 9:32 pm

||ముందుమాట -4||

రచన : kaasi raju | బ్లాగు : తూరుపుగోదారి
ఎప్పుడైనా కలిసి కూర్చున్నపుడు కతల గురించీ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటాము . నువ్వు ప్రత్యేకమైనోడివనీ అందర్లాగ మాట్లాడవనీ అంటుంటావు. అవును ఒంటరిగా వున్నపుడు మనం నోళ్ళు మూసుకుని మాట్లాడుకున్నదీ,కళ్ళు తెరుచినా ఎవరూ కనపడరన్నదీ మన సాంగత్యపు గత్యంతరమనీ నీకెప్పుడూ చెప్పను. నువ్వేమో ముద్దిచ్చి ప్రత్యేకతను గుర్తుచేసాక మూత్తుడుచుకుంటూ లోపల వేడెక్కిన రక్త ప్రవాహాన్ని ధమనుల భాషలో నీకు చెబుదామని చూస్తాను. నీకేమో ఆ ప్రత్యేకత పద్దతైంది కాదంటావు.

ఏదైనా కాళీ దొరికిన గురువారాల్లో గుడీ, దేవుడూ, మెట్లూ వాటిపైన మనమూ కర్పూరాన్ని పులుముకుంటూనో కొబ్బరిముక్... పూర్తిటపా చదవండి...


View the Original article