రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

~*~

చెట్టున పండిన ఆకులు రాలినట్టు
రాలిపోతున్న ఆనవాళ్ళకు
సాక్ష్యంగా నిలబడి ఉండటం  కష్టమే కావచ్చు

**

ఒకొక్కటిగా
చితాబస్మమౌతున్న జ్ఞాపకాలు
సమాధులకు పుష్పగుచ్చాలు
కాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయి

చూస్తున్న కళ్ళకు
రహదారిపై నడుస్తూ నడస్తూ
మలుపుతిరిగి కనబడనట్టు
దృశ్యాదృశ్యాల మధ్య మనసు చిక్కుకుంటుంది

**

కొన్ని
పాదముద్రలను వదిలేయడం
కొన్ని పాదముద్రలను వెదుక్కోవడం
అనివార్య నిరంతర పరిభ్రమణం
 
భావోద్రేకాలలో
పొంగే నదులు ఎండిన ఎడారులతో
జోలెనింపుకోవడం తప్పనిస... పూర్తిటపా చదవండి...


View the Original article