రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
చేతులు కలిపిన చప్పట్లు,
దిక్కులకు వినిపించుదము;
సీతమ్మ చిక్కుడు కాయ్
పందిళ్ళను వేద్దాము;

మల్లెమొగ్గ, పిల్లిమొగ్గ;
చెమ్మచెక్క చేరడేసి మొగ్గలను;
వెన్నెలలో ఏరుకుందామా?

సొరగులలో దాచినట్టి
అచ్చనగాయలు అన్నీ;
కుప్పలుగా కూర్చినట్టి
ఘుమఘుమల బాల్యానికి,
శ్రీకారం  చుడదామా?

చిన్నచిన్న చిలిపిచేష్థలన్నిటినీ అల్లిపెట్టి,
నగలు కూడ చేసిపెడదామా?
ఆటపాటలన్నింటి ఆనందం, ఆహ్లాదం, సొగసులను
ఆటవిడుపుగా మనము;
మనసారా అందరికీ; విరివిగాను పంచిపెడదమా!

*******************************;
పూర్తిటపా చదవండి...


View the Original article