Blogger Templates and Widgets
Showing posts with label అనువాదలహరి. Show all posts
Showing posts with label అనువాదలహరి. Show all posts

Thursday, 12 February 2015 10:01 am

కుమ్మరివాని మట్టి… మేరీ ట్యూడర్ గార్లాండ్, అమెరికను కవయిత్రి. | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మనం ప్రపంచాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి

తిరిగి అతకబోతే మనం వాటితో ఏమిటి తయారుచెయ్యగలం?

మనం కొండదగ్గరకి వెళ్ళిచూస్తే,

అది ఒకప్పటి మాహా పర్వతం అయి ఉంటుంది;

మనం సన్నగా పారుతున్న సెలయేటిని చూస్తే

అది ఒకప్పటి మహా నది అయి ఉంటుంది;

గాలికి చెల్లాచెదరైన ఓక్ చెట్ల పొదల్లో తిరుగాడబోతే

అదొకప్పటి కారడవి అయి ఉంటుంది;

మనకపుడు తెలుస్తుంది మనం వెనక్కి మళ్ళి

వచ్చినతోవనే తిరిగి రాలేమని,

కనీసం ‘ఈ క్షణం’ మనల్ని దాటి పోతున్నప్పుడు

ఉన్నచోట ఉన్నట్టుగా ఉండలేము.

మనసులాగే మన తర్వాతి లక్ష్యానికి... పూర్తిటపా చదవండి...



View the Original article

Tuesday, 10 February 2015 9:46 am

ఋణగ్రస్తుడు… సారా టీజ్డేల్, అమెరికను | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఈ బొందిలో ఊపిరి

ఇంకా కొట్టుమిట్టాడినంతవరకూ,

నల్లగా కాలుడు ఎదురైనపుడు

దాని గర్వపు పురులు విచ్చుకున్నపుడు;

ప్రేమా, ప్రఖ్యాతులపై అప్పటికీ

నాకు కోరిక సడలనప్పుడు;

కాలం దాన్ని లొంగదీసుకోకుండా

చాలా ఉన్నతంగా మనసుని నిలబెట్టినపుడు,

పూర్తిటపా చదవండి...



View the Original article

Wednesday, 4 February 2015 10:52 am

వార్ధక్యం రావడం అంటే… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

“వార్ధక్యం రావడం” అంటే ఏమిటి?
ఆకారంలోని శోభనీ,
కళ్ళలోని మెరుగునీ కోల్పోవడమా?
అందం దాని అలంకారాలని కోల్పోడమా?
అవును, కానీ అవొక్కటే కాదు.

మన వికసనము కోల్పోవడమే కాదు,
మన శక్తి … మన సత్త్వము క్షీణించినట్టు అనిపించడమా?
లేక, మన శరీరంలోని ప్రతి అంగమూ
బిరుసెక్కినట్టనిపించి, ప్రతి చర్యలోనూ నైపుణ్యం తగ్గి,
ప్రతి నరం నీరసంగా కొట్టుకోవడమా?

<... పూర్తిటపా చదవండి...



View the Original article

Thursday, 29 January 2015 11:03 am

రుబాయీ- XVI, ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఒకటి తర్వాత ఒకటి పగలూ రాత్రీ ద్వారాలుగా ఉన్న

ఈ పాడుబడ్డ సత్రంలో, చూడు, సుల్తానులు

ఒకరి వెనక ఒకరు ఇక్కడ బసచేసిన ఆ గంటా, ఘడియా

తమ వైభవాల్ని ప్రదర్శించి, ఎవరిత్రోవన వాళ్ళు పోయారో!

.

ఉమర్ ఖయ్యాం

18 May 1048 – 4 December 1131

పెర్షియను కవి

పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 28 January 2015 10:26 am

సూక్తి … మార్షల్, ప్రాచీన రోమను కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

గతకాలపు కవులని తీసిపారెస్తావు

జీవితం బాగులేదని నిందిస్తావు.

నీ స్తోత్రాలకి ఒక దణ్ణం; నీ పొగడ్తలు

పడి చావవలసినంత గొప్పవేమీ కావు

.

మార్షల్

క్రీ. శ. 1 వ శతాబ్ది.

ప్రాచీన రోమను కవి

.పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 25 January 2015 10:26 am

అందమూ – నిర్మలత్వమూ… సాఫో, ప్రాచీన గ్రీకు కవయిత్రి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఒక సుందరమైన పురుషుడు

చూపులకి మాత్రమే అందంగా ఉంటాడు

నిర్మలమైన పురుషుడు నిర్మలంగానే కాకుండా

అందంగా కూడా ఉంటాడు.

.

సాఫో

క్రీ. పూ. 7 వశతాబ్ది 

ప్రాచీన గ్రీకు కవయిత్రి

పూర్తిటపా చదవండి...



View the Original article

Tuesday, 30 December 2014 11:59 am

మార్మిక మార్గము… దారా షుకోయ్, పెర్షియను కవి | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

దేముడినితప్ప మరెవ్వరినీ శరణు కోరకు
జంధ్యాలూ, తావళాలూ లక్ష్యానికి సాధనాలు మాత్రమే
ఈ నియమ నిష్ఠలన్నీ వట్టి బూటకాలూ, భేషజాలూ.
భగవంతుడిని అవి ఎలా చేరువ చేస్తాయి?   

రాజవడం సుళువు, ముందు పేదరికమేమిటో తెలుసుకో,
వానచినుకు సముద్రంగా మారగలిగినపుడు
ముత్యంగా ఎందుకు మారాలి?

బంగారం అంటిన చేత... పూర్తిటపా చదవండి...



View the Original article

Sunday, 30 November 2014 8:26 am

An Open-ended Poem… Ravi Verelly, Telugu, Indian | అనువాదలహరి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

Under the

Unwinking sky…

Drips beautiful vitriolic spangles

Occasionally

Through its leafy canoes…

The cocoanut

As if it quenches the thirst

of the whole village…

croons lazily like a well-lubed cart

the pulley.

With the airs of

pulling the hiding sky by its tresses

and siphoning it off from the bottom

Looks arrogant

the insolent pail.

Looking at its reflection in the puddle-mirror

preens leisurely i... పూర్తిటపా చదవండి...



View the Original article

Friday, 17 October 2014 8:20 am

అనువాదలహరి : కానుకలు… జేమ్స్ థామ్సన్, స్కాటిష్ కవి

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మనిషికి అతను స్వారీ చెయ్యగల గుర్రాన్నీ

నడపగల ఓడనీ ఇవ్వు;

అతని హోదా, సంపదా, శక్తీ, ఆరోగ్యం

నేలమీదగాని, ... పూర్తిటపా చదవండి...



View the Original article

Sunday, 12 October 2014 12:45 pm

అనువాదలహరి : అందమైన గాయని … ఏండ్రూ మార్వెల్, ఇంగ్లీషు కవి

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. యతిభ్యశ్చాధమం ప్రోక్తం వానప్రస్థశ్చ మధ్యమం 
గృహస్థాత్ స్వీకరో మంత్రం ప్రకుర్వీత గురూత్తమాత్.
ఆ. మంత్ర ముపదేశమునుగొను మహితులకును
యతుల వల్లను గొనుటది యధమమరయ.
మధ్యమము వానప్రత్శుచే మహిని గొనిన.
ఉత్తమము గృహస్థునినుండి యొనరఁ గొనిన.
భావము. యతులదగ్గర... పూర్తిటపా చదవండి...


View the Original article